Bandi Sanjay visited Sarada Peetha: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శృంగేరిలో శారదా పీఠాన్ని సందర్శించారు. విధుశేఖర భారతీస్వామి, శారదామాతను సంజయ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. సనాతన ధర్మ పరిరక్షణలో ముందుండాలని జగద్గురువులు ఆయనకి సూచించారు. తనతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా లింగన్నపేట వేద రాధాకృష్ణ శర్మ, భాజపా మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతా మూర్తి శారదాపీఠాన్ని దర్శించుకున్నారు.
శారదా పీఠాన్ని సందర్శించిన బండి సంజయ్ - Who are going to Saradha peetha with Sanjay
Bandi Sanjay visited Sarada Peetha: కర్ణాటక రాష్ట్రంలోని శృంగేరిలో ఉన్న ప్రసిద్ధ శారదా పీఠాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సందర్శించారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని శారదాంబ అమ్మవారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.
శారదా పీఠాన్ని సందర్శించిన బండి సంజయ్