రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆరోపించారు. మేధావులను ప్రలోభ పెట్టేందుకు శనివారం రాత్రి కొందరు తీవ్రంగా ప్రయత్నించారని విమర్శించారు. ఒక్కో ఓటుకు రూ.10 వేలు ఇచ్చి పట్టభద్రులను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారని ఆక్షేపించారు.
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ప్రయత్నాలు: బండి సంజయ్
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేందుకు పలువురు నేతలు ప్రయత్నించారని భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆరోపించారు. పట్టభద్రులను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నాలు చేశారని విమర్శించారు. ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ప్రయత్నాలు: బండి సంజయ్
ఉద్యోగుల్ని భయపెట్టే ప్రయత్నం జరిగిందని.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. పట్టభద్రులు, మేధావులు ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. పట్టభద్రులు ఎక్కువ సంఖ్యలో పోలింగ్లో పాల్గొని.. ఓటింగ్ శాతం పెంచుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:భాజపా ఆట మొదలెడితే తెరాసకు దిమ్మతిరుగుద్ది : కిషన్ రెడ్డి