Bandi Sanjay Fires on BRS Government : రాష్ట్రంలో ఎన్నికల వేడి ప్రారంభమైంది. ఈ ఏడాదిలో జరగనున్న శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి మరోమారు ఆశీర్వదించాలని అధికార పార్టీ ప్రజానీకాన్ని కోరుతుండగా.. సర్కార్ వైఫల్యాలే ప్రధాన ఎజెండాగా విపక్షాలు కార్యాచరణను వేగవంతం చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధాన పార్టీలు ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నాయి. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను ఉద్దేశిస్తూ ఆరోపణలు గుప్పించారు.
Bandi Sanjay Comments on KTR : తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రులతో సమావేశం కావడాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాజకీయాలు, పరిపాలన వేరు వేరు అన్న సంజయ్.. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి, నాయకుడు వెళ్లినా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అపాయింట్మెంట్ ఇస్తుందని తెలిపారు. అలాగే కేటీఆర్ ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి చేసిన అభివృద్ధిపై కేసీఆర్ ఎప్పుడైనా.. ఎక్కడైనా మాట్లాడారా అని ధ్వజమెత్తారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ కార్యక్రమంలోబండి సంజయ్ పాల్గొన్నారు. పార్టీ నేతలతో కలిసి శ్యామ ప్రసాద్ ముఖర్జీ చిత్ర పటం వద్ద నివాళులు అర్పించిన బండి... తొమ్మిదేళ్లకే దశాబ్ది ఉత్సవాలు నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు.