గొర్రెల పంపిణీలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టాలని భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ డిమాండ్ చేశారు. గొల్ల కురుమలు కట్టిన డబ్బును వడ్డీతో సహా చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
'గొల్ల కురుమలు కట్టిన డబ్బు వడ్డీతో సహా ఇవ్వాలి' - బండి సంజయ్ తాజా వార్తలు
రాష్ట్రంలో గొర్రెల పంపిణీ కార్యక్రమంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రభుత్వాన్ని కోరారు. గొల్ల కురుమలు కట్టిన డబ్బులను వడ్డీతో సహా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
'గొల్ల కురుమలు కట్టిన డబ్బు వడ్డీతో సహా ఇవ్వాలి'
గొల్ల కురుమ సంఘం నాయకులు బండి సంజయ్‌ను కలిసి తమ తరపున పోరాటం చేయాలని కోరారు. మూడేళ్లుగా మూలుగుతున్న గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని తక్షణమే తిరిగి ప్రారంభించాలని అన్నారు. యాదవులకు సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి :జాతీయ రహదారిపై పసుపు రైతుల ఆందోళన