భాజపా తెలంగాణ విమోచన కమిటీ రాష్ట్ర కన్వీనర్ స్వామిగౌడ్ మరణించారన్న వార్త తీవ్రంగా బాధించిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పార్టీ సిద్ధాంతాలే జీవితంగా, సేవా కార్యక్రమాల్లో నిరంతరం పని చేసేవారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రజా ఉద్యమాలలో చురుకుగా పాల్గొనేవారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
స్వామిగౌడ్ మృతి పార్టీకి తీరని లోటు: బండి సంజయ్ - స్వామిగౌడ్ మృతి పార్టీకి తీరని లోటు
భాజపా తెలంగాణ విమోచన కమిటీ రాష్ట్ర కన్వీనర్ స్వామిగౌడ్ మరణం పార్టీకి తీరని లోటని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. స్వామిగౌడ్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
స్వామిగౌడ్ మృతి పార్టీకి తీరని లోటు: బండి సంజయ్
పార్టీ అభివృద్ధిలో వారి పాత్ర ఎనలేనిదని.. ఆయన మరణం పార్టీకి తీరనిలోటన్నారు. స్వామిగౌడ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానన్నారు.
ఇవీ చూడండి: విలువైన భూములు పోయినా.. పరిహారం దక్కలేదు..