తెలంగాణ

telangana

By

Published : Jul 2, 2022, 8:15 PM IST

ETV Bharat / state

కేసీఆర్​ ప్రస్తుతం అచేతన స్థితిలో ఉన్నారు: బండి సంజయ్

BANDI SANJAY: ముఖ్యమంత్రి కేసీఆర్​పై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో​ విమర్శలు గుప్పించారు. కేసీఆర్​ ప్రస్తుతం అచేతన స్థితిలో ఉన్నారన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిని వెంట బెట్టుకొని ర్యాలీలు చేస్తూ.. ఆ పదవి ఖ్యాతికి తెరాస నేతలు అపకీర్తి తెస్తున్నారని దుయ్యబట్టారు.

కేసీఆర్​ ప్రస్తుతం అచేతన స్థితిలో ఉన్నారు: బండి సంజయ్
కేసీఆర్​ ప్రస్తుతం అచేతన స్థితిలో ఉన్నారు: బండి సంజయ్

BANDI SANJAY: సీఎం కేసీఆర్‌ బలహీనుడని.. ప్రస్తుతం అచేతన స్థితిలో ఉన్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ పేర్కొన్నారు. ఈ 8 ఏళ్ల పాలనలో తెరాస చేసిన గొప్ప పనులేవో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని కేసీఆర్ ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు. ప్రధాని మోదీ ఇస్తున్న నిధులతో ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శించారు. హెచ్​ఐసీసీలో జరుగుతోన్న పార్టీ కార్యవర్గ సమావేశాల్లో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా దేశంలో ఎక్కడైనా రాష్ట్రపతి అభ్యర్థి కోసం ఫ్లెక్సీలు కడతారా అని బండి సంజయ్​ ప్రశ్నించారు. రాష్ట్రపతి అభ్యర్థిని వెంట బెట్టుకొని ర్యాలీలు చేస్తారా అని నిలదీశారు. అత్యున్నత రాష్ట్రపతి పదవి ఖ్యాతికి తెరాస నేతలు అపకీర్తి తెస్తున్నారని విమర్శించారు. రాష్ట్రపతి ఎన్నిక ఏమైనా జీహెచ్‌ఎంసీ, పురపాలిక ఎన్నికలా అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

సీఎం కేసీఆర్‌ బలహీనుడు. ఇప్పుడు అచేతన స్థితిలో ఉన్నారు. 8 ఏళ్ల పాలనలో తెరాస చేసిన గొప్ప పనులేవో చెప్పాలి..? ప్రధాని మోదీ ఇస్తున్న నిధులతో ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు రుణమాఫీ చేయలేదు. దేశంలో ఎక్కడైనా రాష్ట్రపతి అభ్యర్థి కోసం ఫ్లెక్సీలు కడతారా? అత్యున్నత రాష్ట్రపతి పదవి ఖ్యాతికి అపకీర్తి తెస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నిక ఏమైనా జీహెచ్‌ఎంసీ, పురపాలిక ఎన్నికలా?-బండి సంజయ్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

మరోవైపు రాష్ట్రంలో క్రైం రేటు పెరిగిందని బండి సంజయ్​ ఆరోపించారు. తెరాస విచ్చల విడితనంతోనే శాంతి భద్రతలు క్షీణించాయని మండిపడ్డారు. తెరాస నేతలు అత్యాచారాలు, దందాలు, డ్రగ్స్‌ మాఫియాకు పాల్పడుతూ.. హైదరాబాద్‌ను డ్రగ్స్‌కు అడ్డాగా మార్చేశారని దుయ్యబట్టారు. డ్రగ్స్‌ను అరికట్టేస్తున్నట్లు కేసీఆర్​ లేనిపోని ప్రకటనలు గుప్పిస్తారన్న బండి సంజయ్​.. ప్రెస్‌మీట్‌లు పెట్టి కేసీఆర్‌ రెండు, మూడ్రోజుల పాటు హల్‌చల్‌ చేస్తారని విమర్శించారు. అంతకుమించి చేసేదేమీ ఉండదని దుయ్యబట్టారు.

కేసీఆర్​ ప్రస్తుతం అచేతన స్థితిలో ఉన్నారు: బండి సంజయ్

ABOUT THE AUTHOR

...view details