తెలంగాణ

telangana

ETV Bharat / state

LIVE VIDEO: సొంత బ్యాండ్​ స్టార్ట్​ చేశాడని చితక్కొట్టారు - BAND GANG ATTACK

మనుషుల్లో పైశాచికత్వం పెరిగిపోతోంది. రోజురోజుకు క్రూరత్వం కట్టలు తెంచుకుంటోంది. నిన్నటి వరకు తమతో బ్యాండ్​ కొట్టుకుంటూ ఉన్న వ్యక్తి.. వాళ్లలో ఇమడలేక ఇంకో బృందాన్ని ఏర్పరచుకున్నాడు. అది చూసి ఓర్వలేని తోటి సభ్యులు.. అదును చూసి.. ఒక్కన్ని చేసి.. మూకుమ్మడిగా.. విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటన సికింద్రాబాద్​ లోతుకుంటలో జరిగింది.

band gang brutal attack on member in lothkunta
band gang brutal attack on member in lothkunta

By

Published : Sep 24, 2021, 10:40 PM IST

సొంత బ్యాండ్​ స్టార్ట్​ చేశాడని తోటిసభ్యుల మూకుమ్మడి దాడి..
సికింద్రాబాద్ అల్వాల్ పీఎస్ పరిధిలోని లోతుకుంటలో దారుణం చోటుచేసుకుంది. ఓ బ్యాండ్ బృందానికి చెందిన యువకునిపై తోటి సభ్యులు విచక్షణారహితంగా దాడి చేశారు. గత కొంతకాలంగా అందరూ కలిసి ఒకే బ్యాండ్​లో పని చేస్తున్నారు. ఇటీవల కాలంలో బ్యాండ్​ బృంద సభ్యుడైన నాగసాయికి.. మిగత వారికి మధ్య మనస్పర్థలు వచ్చాయి. అప్పటి నుంచి నాగసాయి.. బోనాల పండుగ నుంచి నూతనంగా మరో బ్యాండ్ బృందాన్ని ఏర్పరచుకున్నాడు.

సమయం కోసం చూసి..

నాగసాయి మరో బ్యాండ్ బృందాన్ని తయారు చేయడం ఇష్టం లేని.. తోటి సభ్యులు నాగసాయిపై పగ పెంచుకున్నారు. ఎప్పుడు దొరుకుతాడా..? అని మిగతా సభ్యులు ఎదురు చూశారు. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో నాగసాయి ఇంటి వద్దకు వెళ్లి.. ద్విచక్రవాహనంపై లోతుకుంటలోని వారి పాత బ్యాండ్ కార్యాలయానికి తీసుకువచ్చారు. కాసేపు అతడితో మాట్లాడారు. ఈ క్రమంలోనే.. మాట మాట పెరిగి వాగ్వాదం చోటు చేసుకుంది.

ఇష్టమొచ్చినట్టు..

అప్పటివరకు కోపంతో ఉన్న తోటి సభ్యులు.. అదే అదునుగా భావించి ఒక్కసారిగా నాగసాయిపై మూకుమ్మడి దాడి చేశారు. కాళ్లతో తన్నడం, పిడిగుద్దులతో విచక్షణారహితంగా కొట్టారు. నాగసాయి బట్టలు విప్పేసి.. శరీరంపై డీజిల్ పోసి ఆటూఇటూ లాగుతూ కొట్టారు. విషయం తెలుసుకున్న నాగసాయి కుటుంబ సభ్యులు.. అల్వాల్ పోలీసులను ఆశ్రయించారు. దాడి చేసిన బృంద సభ్యులందరిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. దాడికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారుతోంది.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details