తెలంగాణ

telangana

ETV Bharat / state

'చైనా రాఖీలను నిషేధించండి' - సికింద్రాబాద్

చైనా రాఖీలను బహిష్కరించాలని సికింద్రాబాద్‌లో రైల్వే స్టేషన్ ఎదుట హిందూ జనజాగృతి సమితి నిరసన చేపట్టింది. చైనాను ఆర్థికంగా దెబ్బతీయాలని ప్రజలను కోరింది.

'చైనా రాఖీలను నిషేధించండి'

By

Published : Aug 14, 2019, 7:03 AM IST

Updated : Aug 14, 2019, 7:17 AM IST

చైనా రాఖీలు కొనడమంటే శత్రు దేశానికి ఆర్థిక లాభం చేకూర్చినట్లవుతుందని హిందూ జన జాగృతి కార్యకర్తలు పిలుపునిచ్చారు. ఆ దేశ వస్తువులను, రాఖీలను బహిష్కరించాలని కోరుతూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదుట ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చైనా రాఖీలను నిషేధించాలని హిందూ జనజాగృతి సమితి రాష్ట్ర కోఆర్డినేటర్ చేతన్ గాడి పిలుపునిచ్చారు. ఆర్టికల్ 370 విషయంలో పాకిస్తాన్‌కు చైనా వత్తాసు పలుకుతూ భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడిందని ఆరోపించారు.

'చైనా రాఖీలను నిషేధించండి'
Last Updated : Aug 14, 2019, 7:17 AM IST

ABOUT THE AUTHOR

...view details