Balkampet Yellamma Temple Clash :బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవానికి లక్షల్లో భక్తులు తరలివచ్చారు. పిల్లలు, మహిళలు, వయోధికులు అందర్నీ ఒకే వరుస కేటాయించడంతో సమస్య మొదలైంది. ఈ క్రమంలోనే ఎండ తీవ్రతకు భక్తులు తాళలేకపోయారు. మరోవైపు వీఐపీ పాసులు అధికంగా జారీ చేశారు. ఇదంతా శాఖల సమన్వయలోపంగా ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇష్టానుసారం వీఐపీ పాసులు జారీ చేయటం.. ఊహించని విధంగా లక్షలాది మంది తరలిరావటంతో పోలీసులు నియంత్రించలేకపోయారు.
ఆలయ కమిటీ, దేవాదాయశాఖ అధికారుల మధ్య అంతర్గత గొడవలతో.. ఎవరకివారే అన్నట్టుగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. బోనాల కాంప్లెక్స్‌లో అన్నదానం వద్దంటూ పోలీసుల సూచనలు పెడచెవిన పెట్టారు. మంగళవారం రాత్రి వేలాది మంది భక్తులు ఆలయ సమీపంలోని బోనాల కాంప్లెక్స్‌లో విడిది చేశారు. ఉదయం నుంచి అక్కడే తిష్టవేసిన మందుబాబులు, పాతనేరస్తులు.. అర్ధరాత్రి దాటాక హడావుడి చేశారు. మత్తులో భక్తులను బెంబేలెత్తించారు.
- Attacked with a knife for refusing love: ప్రేమను నిరాకరించిందనే కోపం.. పట్టపగలే ప్రియురాలిపై కత్తితో దాడి
Attacks on Five People in Balkampet Yellamma Temple : పోలీసుల బందోబస్తు నామమాత్రంగా ఉండటంతో మరింతగా రెచ్చిపోయారు. మూడు జట్లుగా మారి గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే ఎల్లారెడ్డిగూడకు చెందిన కార్తిక్‌రాజ్ మిత్రులతో మంగళవారం మధ్యాహ్నం ఆలయానికి వెళ్లారు. సాయంత్రం సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో కార్తిక్, శుభమ్‌పై దాడి చేశారు. దాడిలో గాయపడిన కార్తిక్‌ను ఆసుపత్రిలో చేర్చారు. క్రిస్టల్ హోటల్ వద్ద రాత్రి జరిగిన మరో ఘటనలో విశాల్, విష్ణు సోదరులపై పాతకక్షలతో.. యశ్వంత్, సూర్య కత్తులతో దాడి చేసి గాయపరిచారు.