బోగస్ ఇండెంట్లు సృష్టించి పెద్ద ఎత్తున నిధులు కొల్లగొట్టారనే అభియోగంతో అనిశా నమోదు చేసిన కేసులో ప్రధాన నిందితురాలు దేవికారాణి, పద్మ, వసంత ఇందిర, ఫార్మాసిస్ట్ రాధిక, హర్షవర్ధన్, ఓమ్ని మోడీ సంస్థ నిర్వాహకుడు శ్రీహరిబాబు, నాగరాజుకు బెయిల్ మంజూరయింది. చంచల్‌గూడ జైలు నుంచి శ్రీహరిబాబు, హర్షవర్ధన్‌తో పాటు మహిళా జైలు నుంచి రాధిక విడుదలయ్యారు. ఇతర నిందితులు ఇదే కుంభకోణంతో సంబంధం ఉన్న రెండు కేసుల్లో... నిందితులుగా ఉండటం వల్ల విడుదల కాలేకపోయారు.
ఈఎస్ఐ కుంభకోణం నిందితులకు బెయిల్
రాష్ట్రంలో కలకలం రేపిన ఈఎస్ఐ కుంభకోణం నిందితులకు బెయిల్ మంజూరైంది. చంచల్‌గూడ జైలులో ఉన్న ఏడుగురికి బెయిల్ దొరకగా... ముగ్గురు మాత్రమే విడుదలయ్యారు. మిగిలిన వారు మరో కేసులో ఉన్నందున జైల్లోనే ఉన్నారు.
BAIL GRANTED TO ESI SCAM ACCUSED
ఇదీ చూడండి : 'తెలంగాణలో ఎందుకు పుట్టానురా అనిపిస్తోంది
Last Updated : Nov 29, 2019, 8:00 AM IST