టిబెటియన్ మెడికల్ అండ్ అస్ట్రో ఇనిస్టిట్యూట్ 103వ వార్షికోత్సవం సికింద్రాబాద్ పద్మారావు నగర్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరయ్యారు. భారతీయ సాంప్రదాయం, వైద్యం పురాతనమైనవని, పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి మన వైద్యాన్ని విస్మరించామని మంత్రి అన్నారు.
ఆయుర్వేద వైద్యం వైపు మళ్లీ మక్కువ : మంత్రి ఈటల - భారతీయ సాంప్రదాయం, వైద్యం పురాతనమైనవని అన్నారు.
భారతీయ సాంప్రదాయం, వైద్యం పురాతనమైనవని, పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి మన వైద్యాన్ని విస్మరించామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. టిబెటియన్ మెడికల్ అండ్ అస్ట్రో ఇనిస్టిట్యూట్ 103వ వార్షికోత్సవంలో మంత్రి పాల్గొన్నారు.
ఆయుర్వేద వైద్యం వైపు మళ్లీ మక్కువ : మంత్రి ఈటల
నేపాల్, సిక్కిం, భూటాన్ అక్కడి ప్రకృతి అందాలు, వారి జీవన విధానం చూస్తే వారికి మనకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. అక్కడి వారు రోగాల బారిన పడే అవకాశం చాలా తక్కువ అని తెలిపారు. టిబెట్‌తో పోల్చుకుంటే భారతదేశంలో రోగాలు ఎక్కువన్నారు. ప్రజలు ప్రాచీన ఆయుర్వేద వైద్యం వైపు మళ్లీ మక్కువ చూపుతున్నారని పేర్కొన్నారు. ఈ మందులను ప్రచారం చేయడంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందన్నారు.
ఇదీ చూడండి : 'నిజామాబాద్‌లో ఎన్నికల కోడ్ ఉల్లంఘన'