Ram Mandir with chalk pieces: శ్రీరాముడిపై ఉన్న అభిమానంతో అయోధ్య రామ మందిరాన్ని నిర్మించాడు. అచ్చం రామమందిరాన్ని తలపించేలా వంద చాక్ పీసులతో రూపొందించాడు హైదరాబాద్కు చెందిన మైక్రో ఆర్టిస్ట్. శ్రీరామనవమిని పురస్కరించుకుని మందిర నిర్మాణం చేపట్టినట్లు మైక్రో ఆర్టిస్ సంపత్ వివరించాడు. జియాగూడకు చెందిన సంపత్(19) కేవలం పదిరోజుల్లోనే నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపాడు.
Ram Mandir with chalk pieces: మెక్రో ఆర్టిస్ట్ ఘనత.. వంద చాక్ పీసులతో అయోధ్య రామమందిరం
Ram Mandir with chalk pieces: శ్రీరాముడిపై ఉన్న భక్తిని వినూత్నంగా చాటుకున్నాడు. వంద చాక్ పీసులతో అయోధ్యరామ మందిరాన్ని నిర్మించి ఔరా అనిపించాడు. అచ్చం అయోధ్యను తలపిస్తున్న మందిరాన్ని కేవలం పది రోజుల్లోనే పూర్తి చేశాడు. చూడముచ్చటగా ఉన్న ఆ నిర్మాణం హైదరాబాద్కు చెందిన మైక్రో ఆర్టిస్ట్ రూపొందించాడు.
వంద చాక్ పీసులతో అయోధ్య రామమందిరం
శ్రీరాముడిపై భక్తితో ఈ విధంగా అయోధ్య రామమందిరాన్ని నిర్మించానని వెల్లడించాడు. దాదాపు 8.2 సెంటీమీటర్లు ఎత్తు, 16 సెంటీమీటర్ల వెడల్పుతో మందిరాన్ని రూపొందించినట్లు సంపత్ పేర్కొన్నాడు.