రవాణా శాఖ అధికారులు పాఠశాల బస్సులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సికింద్రాబాద్ తిరుమలగిరి ఆర్టీవో కార్యాలయంలో పాఠశాలల బస్సు డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, తగు జాగ్రత్తలు సూచించారు. పిల్లల భద్రతే ధ్యేయంగా... నగరంలో 5 ఫిట్నెస్ స్క్వాడ్లు పెట్టి 2వేల బస్సులకు గానూ 1200 బస్సులకు పరీక్షలు నిర్వహించినట్లు ఆర్టీవో రంగనాయుడు తెలిపారు. నిబంధనలు పాటించని బస్సులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. పాఠశాలల యాజమాన్యం కూడా బాధ్యతగా ఉండాలని సూచించారు.
పాఠశాల బస్సులపై ప్రత్యేక దృష్టి
సికింద్రాబాద్ తిరుమలగిరి ఆర్టీవో కార్యాలయంలో పాఠశాలల పునః ప్రారంభాన్ని దృష్టిలో ఉంచుకొని పాఠశాలల బస్సు డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్‌పోర్టు జాయింట్ కమిషనర్, తిరుమలగిరి ఆర్టీవో పాల్గొన్నారు. పాఠశాల బస్సులపై ప్రత్యేక దృష్టి పెట్టామని ట్రాన్స్‌పోర్టు జాయింట్ కమిషనర్ పాండు రంగనాయుడు తెలిపారు.
హాజరైన డ్రైవర్లు