కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకునేలా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ విభాగం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రముఖ పల్మనాలజిస్ట్ డా. పరన్ జ్యోతి, అపోలో ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ శ్రీకాంత్ పాల్గొన్నారు. కరోనా నుంచి కాపాడుకోవటానికి ముఖ్యంగా చేతులను తరచూ శుభ్రపరచుకోవటం, భౌతిక దూరం పాటించాలని డా. పరన్ జ్యోతి చెప్పారు. ప్లాస్మాథెరపీ ద్వారా కొంత వరకు కరోనా రోగుల్లో ఇమ్యూనిటీని పెంచి కరోనాని నియంత్రించవచ్చని తెలిపారు.
'ప్లాస్మాథెరపీ కరోనా రోగుల్లో ఇమ్యూనిటీని పెంచుతుంది'
ప్లాస్మాథెరపీ ద్వారా కొంత వరకు కరోనా రోగుల్లో ఇమ్యూనిటీని పెంచి... వ్యాధిని నియంత్రించవచ్చని ప్రముఖ పల్మనాలజిస్ట్ డా. పరన్ జ్యోతి అభిప్రాయపడ్డారు. ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ విభాగం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ప్లాస్మోథెరపీ కరోనా రోగుల్లో ఇమ్యునిటీని పెంచుతుంది
లాక్డౌన్ను విధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంచిపని చేశాయని... లేకపోతే ఇప్పటి వరకు చాల మంది వైరస్ బారిన పడి ఉండేవారని డా. శ్రీకాంత్ తెలిపారు. ప్రజలు రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు తగిన ఆహారాాన్ని తీసుకోవాలన్నారు. కరోనా పట్ల జాగ్రత్తలు పాటించాలని, లాక్ డౌన్లో స్వచ్ఛందంగా పాల్గొనాలని సూచించారు.
ఇదీ చూడండి:'మహారాష్ట్ర కచ్చితంగా కరోనా ప్రమాదంలో ఉంది'