తెలంగాణ ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ వినూత్న కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దుకాణాలు, షాపింగ్ మాల్స్, హోటళ్ల సూచిక బోర్డుపై తెలుగులో ఉంటేనే వస్తువులు కొనుగోలు చేయాలని కోరింది. రానున్న 40 రోజుల్లో ఆశించిన ఫలితం రాకపోతే... జూన్ 10 నుంచి బడా షాపింగ్ మాల్స్ , దుకాణాలు , హోటళ్ల ఎదుట నిరసన ప్రదర్శనలు చేపడుతామని ఆటో డ్రైవర్లు హెచ్చరించారు.
తెలుగులో ఉంటేనే కొంటాం: ఆటో డ్రైవర్స్ - auto drivers
దుకాణాల సూచిక బోర్డులపై తెలుగుతో పాటు ఉర్దూ భాషలు లేకుంటే వస్తువులు కొనుగోలు చేయవద్దని తెలంగాణ ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. 40 రోజుల్లో ఆశించిన ఫలితం రాకుంటే బడా షాపింగ్ మాల్స్, దుకాణాల ముందు నిరసనకు దిగుతామని హెచ్చరించింది.
లైసెన్సులను రద్దు
జంట నగరాల్లో చాలా వరకు ఆంగ్లంలోనే దుకాణాల సూచిక బోర్డులు రాసి ఉన్నాయని... ఇది తెలుగు, ఉర్దూ భాషా ప్రేమికులకు అవమానకరమన్నారు. దుకాణదారులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న కూడా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని మాతృభాషను నిర్లక్ష్యం చేసే దుకాణాల లైసెన్సులను రద్దు చేయాలని ఐకాస కన్వీనర్ మహమూద్ అమానుల్లా ఖాన్ డిమాండ్ చేశారు. మొత్తానికి ఆటో డ్రైవర్లు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇవీ చూడండి: సింధుశర్మకు పాపను అప్పగించిన అత్తింటివారు