ఆటో నడిపేవాళ్లు హెల్మెట్ ధరించాలట. లేదంటే చలానా కట్టాల్సివస్తుంది. వినడానికి వింతగా ఉన్నా... ఇది విజయవాడ ట్రాఫిక్ పోలీసుల రూలు. రవాణాశాఖ నిబంధనల్లో లేకపోయినా... ట్రాఫిక్ పోలీసులు ఆచరిస్తున్న తీరు ఇది.
ఆటోలో వెళ్తుంటే హెల్మెట్ లేదట... - CHALLAN
మీరు ఆటోడ్రైవరా? అయితే... ఆటో నడుపుతున్నప్పుడు శిరస్త్రాణం పెట్టుకోండి. లేదంటే జరిమానా తప్పదు. అదేంటని ఆశ్చర్యపోతున్నారా ? ఏపీలోని విజయవాడలో అంతే..
ఏపీ 16టిఎస్ 8597 నంబరున్న ఆటోపై... ఏపీలోని విజయవాడ మూడో పట్టణ ట్రాఫిక్ పోలీసులు చలానా విధించారు. ఆ డ్రైవర్... ఆన్ లైన్‌లో చలానా చూసుకుని నివ్వెరపోయాడు. ఆటో నడుపుతుండగా హెల్మెట్ పెట్టుకోలేదని అందులో రాసి ఉంది. సాధారణంగా... చలానాతోపాటు, ట్రాఫిక్ పోలీసులు తీసిన ఫొటో జత చేస్తారు. ఆన్ లైన్‌లో చలానా పొందుపరిచేటప్పుడు... ఆ ఫొటోనూ పొందుపరుస్తారు. ఫొటోలో ఆటో స్పష్టంగా కనిపిస్తున్నా... హెల్మెట్ లేదని చలానా రాయడం విశేషం. దీనిపై పోలీసులను వివరణ కోరితే సాంకేతిక లోపం కారణంగా తప్పులు జరుగుతాయని.. తమ దృష్టికి తెస్తే సమస్య పరిష్కరిస్తామని చెప్పుకొచ్చారు.
ఇది చూడండి: సాగు ఆలస్యమే సకల కష్టాలకు మూలం..!
TAGGED:
CHALLAN