తెలంగాణ ఉభయసభల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రణబ్ ముఖర్జీ మృతిపట్ల శాసనసభలో సీఎం కేసీఆర్ సంతాపం తీర్మాణం ప్రవేశపెట్టారు. ప్రణబ్ ముఖర్జీ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రణబ్ మృతితో ఈ దేశం శిఖర సమానమైన నేతను కోల్పోయిందన్నారు.
రాజకీయ సముద్రాన్ని సమర్థంగా ఈదిన నేత.. ప్రణబ్: కేసీఆర్
తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రణబ్ మృతితో ఈ దేశం శిఖర సమానమైన నేతను కోల్పోయిందని కేసీఆర్ అన్నారు.
రాజకీయ సముద్రాన్ని సమర్థంగా ఈదిన నేత.. ప్రణబ్: కేసీఆర్
బంగాల్‌లోని చిన్న గ్రామం నుంచి రాష్ట్రపతి వరకు ఎదిగారని కొనియాడారు. రాజకీయ సముద్రాన్ని సమర్థంగా ఈదిన నేత.. ప్రణబ్ అని గుర్తు చేశారు. జటిల సమస్యలను పరిష్కరించే నేతగా ప్రణబ్ పేరు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. ప్రపంచంలోనే ప్రముఖ ఆర్థికవేత్తగా ప్రణబ్ పేరు తెచ్చుకున్నారని కేసీఆర్ గుర్తు చేశారు.
ఇదీ చదవండి:కరోనా బాధితులకు డెంగ్యూ, మలేరియా ముప్పు
Last Updated : Sep 7, 2020, 11:52 AM IST