దేశంలోనే ప్రథమం.. - KCR
ప్రభుత్వ పథకాల్లో ప్రతిష్ఠాత్మకమైన రెండు పడక గదుల ఇళ్లతో నిరుపేదల కల సాకారం అవుతోందని ముఖ్యమంత్రి తెలిపారు. అర్హులందరికీ లబ్ధి చేకూరేదాకా పథకాన్ని కొనసాగిస్తామన్నారు.
నిరుపేదల కల సాకారం
వంద శాతం ప్రభుత్వ ఖర్చుతో రెండు పడకల ఇళ్లను నిర్మించి ఇవ్వడం దేశంలో ఇదే ప్రథమమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 2,72,763 ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్వంత స్థలంలో ఇల్లు కట్టుకునే వారికి ఆర్థిక సాయం అందించేందుకు నిర్ణయించామన్నారు. శాస్త్రీయ పద్ధతిలో అర్హుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందన్నారు.
Last Updated : Feb 22, 2019, 2:44 PM IST