వ్యవసాయాభివృద్ధికి తెలంగాణ ఖర్చు చేసినట్టు దేశంలోని ఏ రాష్ట్రం ఖర్చుపెట్టట్లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. బడ్జెట్లో వ్యవసాయ శాఖకు రూ.20,107 కోట్లు కేటాయించామని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నామన్నారు.
సస్యశ్యామలం చేస్తాం - HYDERABAD
వ్యవసాయానికి, రైతు సంక్షేమానికి పెద్ద పీట వేసిన ప్రభుత్వం... దేశానికే ఆదర్శంగా నిలబడుతోందని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణాను కోటి ఎకరాల మాగాణి చేసేందుకు కృతనిశ్చయులై ఉన్నామన్నారు సీఎం.
వ్యవసాయాభివృద్ధికై...
మిషన్ కాళేశ్వరం
ఈ ఏడాది నీటి పారుదల రంగానికి రూ.22,500కోట్లు కేటాయించారు.దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్ర జల సంఘం ప్రశంసలు పొందిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా త్వరలోనే రైతులకు నీళ్లు అందించేందుకు సమాయత్తమవుతున్నామన్నారు. మిషన్ కాకతీయ ద్వారా 20వేల చెరువులను ఇప్పటికే పునరుద్ధరించామని తెలిపారు.
Last Updated : Feb 22, 2019, 4:34 PM IST