హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని ప్రజల్లో భయాందోళన నెలకొంది. ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కరోనా కేసుల సంఖ్య చాపకింద నీరులాగా పెరుగుతున్నాయి. నియోజకవర్గంలోని రాంనగర్, కవాడిగూడ, ముషీరాబాద్ ప్రాంతాల్లో దాదాపు 24 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. వీరిలో ఇద్దరు మృతి చెందగా.. 13 మంది డిశ్చార్జ్ అయ్యారు ప్రస్తుతం తొమ్మిది మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చిక్కడపల్లి, బాగ్‌లింగంపల్లిలోని ఈడబ్ల్యూఎస్ క్వార్టర్స్ నివాసి ఓ మహిళకు కరోనా సోకింది. ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల నేపథ్యంలో వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు విస్తృతంగా వైద్య పరీక్షలు, తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ముషీరాబాద్ నియోజకవర్గంలో ప్రత్యేక సర్వే చేపట్టిన వైద్య సిబ్బంది
ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కరోనా కేసులు చాపకింద నీరులా పెరుగుతున్నాయి. తాజాగా ఓ మహిళకు కరోనా పాజిటివ్ అని తేలడం వల్ల ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక సర్వే నిర్వహించారు.
ఆ మహిళ ఈ నెల 10 న తన సోదరుడికి జ్వరం వచ్చిందని అతని ఇంటికి వెళ్లి పరామర్శించారు. అతడికి పరీక్షలు నిర్వహించిన తర్వాత కొవిడ్-19 వచ్చిందని నిర్ధారణ అయింది. తన సోదరుడికి కరోనా సోకిందని అనుమానంతో ఆమె ఎర్రగడ్డలోని ఆయుర్వేద ఆసుపత్రిలో కరోనా పరీక్షలు చేయించుకుంది. మూడు రోజులుగా క్వారంటైన్లో ఉన్న ఆమెకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారు.
ఇవీ చూడండి: రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు తిరుగుతాయి: సీఎం