భాజపా, కాంగ్రెస్.. రెండు పార్టీలు దేశానికి అవసరమేనని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మోదీ, అమిత్ షా ఆర్టికల్ 370, 35ఏ రద్దు చేయడం తన వ్యక్తిగతంగా సరైనదేనని భావిస్తున్నట్లు చెప్పారు. మోదీ, అమిత్ షా ఆర్టికల్ 370 రద్దు చర్చలో నెహ్రూపై ఆరోపణలు చేయడం సబబుకాదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయదని... సీటు కోసం తన భావాలు చంపుకోదని స్పష్టం చేశారు. కశ్మీర్ ప్రజలు పాకిస్థాన్‌లో కలపడానికి ఇష్టపడ్డారని... పాకిస్థాన్ నుంచి కాశ్మీర్‌ను కాపాడడం కోసం నెహ్రూ ఆర్టికల్ 370, 35ఏ తీసుకువచ్చారని వివరించారు. ఆ రోజు మోదీ, అమిత్ షా ఉన్నా అదే నిర్ణయం తీసుకునే వారని చెప్పారు.
ఆర్టికల్ 370, 35ఏ రద్దు సరైందే: జగ్గారెడ్డి - mla
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్టికల్ 370, 35ఏ రద్దు తన వ్యక్తిగతంగా సరైనదేనని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. హైదరాబాద్ సీఎల్పీ కార్యాలయంలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
జగ్గారెడ్డి