తెలంగాణ

telangana

ETV Bharat / state

భాగ్యనగరంలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు పూర్తి - 15 కేంద్రాల్లో కౌంటింగ్‌ - హైదరాబాద్‌లో ఓటింగ్‌ కౌంటింగ్‌ ఏర్పాట్లు

Arrangements For Counting in Hyderabad : అసెంబ్లీ సాధారణ ఎన్నికల కౌంటింగ్‌కు కౌంట్​డౌన్ మొదలైంది. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాబోతోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో మొత్తం 15 నియోజకవర్గాలకు సంబంధించి 15 కేంద్రాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు పెట్టారు. ఉదయం 5 గంటలకే కౌంటింగ్ సిబ్బంది లెక్కింపు చేరుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Arrangements For Counting
Arrangements For Counting in Hyderabad

By ETV Bharat Telangana Team

Published : Dec 2, 2023, 7:33 PM IST

Arrangements For Counting in Hyderabad : అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్(Telangana Election Counting) ప్రక్రియకు సంబంధించి ఈసీ, జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు చేసింది. గ్రేటర్ హైదరాబాద్‌లో మొత్తం 15 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. కౌంటింగ్ కేంద్రాలను హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ(GHMC) కమిషనర్ రోనాల్డ్ రోస్, డిప్యూటీ జిల్లా ఎన్నికల అధికారి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఏర్పాట్లను పరిశీలించారు. ఉదయం 5 గంటలకే పోలింగ్ సిబ్బంది, ఏజెంట్లు లెక్కింపు కేంద్రాలకు చేరుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

తరవాత ఏజెంట్ల సమక్షంలో వీడీయో గ్రఫీ(Video Graphy) తో స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి ఈవీఎంలను కౌంటింగ్ ఏరియాల్లోకి తీసుకొస్తారు. మొదటగా 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో కౌంటింగ్ ప్రక్రియ చేపడతారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అయినా కాకున్నా.. ఉదయం 8.30 గంటలకు ఈవీఎం(EVM)లతో ప్రధానమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది.

రేపే జడ్జిమెంట్ డే- ఎలక్షన్ కౌంటింగ్​కు ఈసీ ఏర్పాట్లు పూర్తి

Assembly Election Fight in Hyderabad :మొత్తం 14 టేబుళ్లలో ఓట్ల లెక్కింపు చేస్తారు. పోస్టల్ బ్యాలెట్‌(Postal Ballet)కు అదనపు టేబుల్ ఏర్పాటు చేస్తారు. టేబుల్ వద్ద ఓ సూపర్ వైజర్, ఇద్దరు సహాయకులు, ఓ మైక్రో అబ్జర్వర్ ఉంటారు. అభ్యర్థులు తమ ఏజెంట్లను కూడా ఉంచోచ్చు. వీరు ఇచ్చే లెక్కలను సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకులు సరి చూస్తారు. అన్ని సరిగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే ఫలితాలు ప్రకటిస్తారు.

ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఓట్ల లెక్కింపు : ఈసారి లెక్కింపునకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్ అందుబాటులోకి వచ్చిందని వేగంగా ఫలితాలు వెల్లడి జరగనుందని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో తక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్న చార్మినార్ నియోజకవర్గం అక్కడ 202 పోలింగ్ కేంద్రాల్లో(Polling Centers) ఎన్నికలు జరిగాయి. ఆయా ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు 15 రౌండ్లలో పూర్తికానుంది. మిగిలిన స్థానాల్లో ఫలితాలు 16 నుంచి 25 రౌండ్లు ఉండనున్నాయి.

నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాలు :

  • దోమలగూడ ఏవీ కాలేజ్‌లో ముషీరాబాద్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు
  • అంబర్ పేట్ జీహెచ్ఎంసీ స్టేడియంలో మలక్‌పేట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు
  • నారాయణగూడ రాజ్ బహదూర్ వెంకట్ రామిరెడ్డి కాలేజ్‌లో అంబర్‌పేట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు
  • యూసుఫ్‌గూడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు
  • ఉస్మానియా యూనివర్సిటీ కామర్స్ కాలేజీలో సనత్ నగర్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు
  • మసబ్ ట్యాంక్ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్‌లో నాంపల్లి నియోజకవర్గ ఓట్ల లెక్కింపు
  • సికింద్రాబాద్ వెస్లీ కాలేజ్ గ్రౌండ్‌లో కంటోన్మెంట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు
  • ఉస్మానియా యూనివర్సిటీ రామ్ రెడ్డి డిస్టెన్స్‌ కేంద్రంలో సికింద్రాబాద్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు
  • మసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీలో కార్వాన్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు
  • కోఠి ఉమెన్స్‌ కాలేజీలో గోషామహల్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు
  • నాంపల్లి ఎగ్జిబిషన్ కమల నెహ్రూ పాలిటెక్నిక్ ఉమెన్స్ కాలేజీలో చార్మినార్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు
  • నిజాం కాలేజ్ లైబ్రరీ హాల్‌లో చాంద్రాయణ గుట్ట ఓట్ల లెక్కింపు
  • నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోని సరోజిని నాయుడు వనిత మహా విద్యాలయంలో యాకుత్‌పుర నియోజకవర్గ ఓట్ల లెక్కింపు
  • ఆరోరా లీగల్ సైన్స్‌లో బహదూర్‌పుర ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి - ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జిల్లా వాసులు

ఉమ్మడి వరంగల్​ జిల్లాలో ఓట్ల లెక్కింపునకు భారీ ఏర్పాట్లు - 12 నియోజకవర్గాల్లో పోలీసుల గట్టి బందోబస్తు

ABOUT THE AUTHOR

...view details