ఆరోగ్య శ్రీ బకాయిలకు సంబంధించిన మొత్తాన్ని తక్షణమే విడుదల చేయాలని తెదేపా సీనియర్ నేత, పోలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతీ ఆరు నెలలకు ఒకసారి సర్కారు ఆస్పత్రుల ప్రతినిధుల జీతాల కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితిని కల్పిస్తోందని ఆరోపించారు. ఆరోగ్య శ్రీ పథకం అమలు, బడ్జెట్ కేటాయింపులు, బిల్లులు చెల్లింపుపై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు వెంటనే ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని కోరారు. మరోమారు ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలవకుండా తగు చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.
'ఆరోగ్యశ్రీ బకాయిలను తక్షణమే విడుదల చేయండి' - ఆరోగ్య శ్రీ
ఆరోగ్య శ్రీ బకాయిలకు సంబంధించిన నిధులను తక్షణమే విడుదల చేయాలని తెదేపా సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలవకుండా తగు చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.
ఆరోగ్యశ్రీ బకాయిలను తక్షణమే విడుదల చేయండి: రావుల