నాంపల్లిలోని రాష్ట్ర ఉద్యానవన శిక్షణ సంస్థలో ప్రతి రెండో శనివారం నగర సేద్యంపై సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సాగు కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అర్బన్ సాగుపై ఇప్పటి వరకు నగరంలో 7500 మందికి శిక్షణ ఇచ్చామని అధికారులు తెలిపారు. 5వేల మంది వరకు ప్రాక్టీస్ చేస్తున్నారని చెప్పారు. అర్బన్ ఫామింగ్ సాగుచేసేందుకు కావాల్సిన పరికరాలను ఉద్యానవన శాఖ తరఫున 50 శాతం సబ్సిడీపై అందిస్తున్నట్లు తెలిపారు. ఇంట్లోనే ఉంటూ, సేంద్రీయ ఎరువుల తయారీ... ఆకుకూరలు ఎలా తయారు చేసుకోవాలి అనే అంశాలను ప్రజలకు వివరించారు. సులభ పద్ధతిలో ఎలా నేర్చుకోవాలి అనే అంశాలను చక్కగా వివరించారని నగర వాసులు హర్షం వ్యక్తం చేశారు.
అర్బన్ సాగు...లాభాలు బాగు...
అర్బన్ సాగు విధానంపై నగర వాసుల్లో రోజురోజుకు అవగాహన పెరుగుతోందని ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు మధుసూదన్ తెలిపారు.
అర్బన్ సాగు..లాభాలు బాగు..