తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉరి వేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య - AR Constable suicide by hanging

హైదరాబాద్ పేట్లబురుజు ఏఆర్ విభాగంలో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ తాగుడుకి బానిసయ్యాడు. కుటుంబ సభ్యులు మానేయమని గట్టిగా చెప్పడంతో మానసికంగా కుంగిపోయిన అతను ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ar conistable suicide in hyderabad
ఉరి వేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య

By

Published : May 4, 2020, 9:00 PM IST

హైదరాబాద్ పేట్లబురుజు ఏఆర్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్​గా పనిచేసే బాలరాజు గత కొంతకాలంగా తాగుడుకు బానిసయ్యాడు. తాగుడు మానేయమని కుటుంబ సభ్యులు ఇబ్బంది పెట్టారు. మానసికంగా కుంగిపోయిన బాలరాజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

విషయం గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని అంబర్​పేట ఎస్సై సురేష్ కుమార్ తెలిపారు.

ఇవీ చూడండి:హైదరాబాద్​లో ఒక్క రోజులోనే 20 కేసులు

ABOUT THE AUTHOR

...view details