Appointment of Four Government Whips in Telangana :తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో విప్‌లుగా నలుగురు ఎమ్మెల్యేలను నియమించింది. జాతోట్ రాంచందర్ నాయక్, బీర్ల అయిలయ్య, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్‌లను విప్‌లుగా నియమించినట్లు సాధారణ పరిపాలనా శాఖ శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. వీరంతా తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వారే కావడం విశేషం. విప్‌లుగా నియమితులైన నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తమ నియామకంపై కృతజ్ఞతలు తెలిపారు.
Telangana Government Appointed Four MLAs as Whips : ఉమ్మడి కరీంనగర్ జిల్లా రుద్రంగి గ్రామంలో ఆది శ్రీనివాస్ (MLA Adi Srinivas) జన్మించారు. యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా 1987లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన, పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. అనేక పదవులు నిర్వహించి వేములవాడ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, పీసీసీ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 1966 సెప్టెంబరు 15న పుట్టిన ఈయన పార్టీలో సీనియర్ నేతగా ఉన్న గుర్తింపుతో విప్‌గాఎంపికయ్యారు.
నేటితో ముగియనున్న శాసనసభ సమావేశాలు - గవర్నర్ ప్రసంగంపై ధన్యావాద తీర్మానంపై చర్చ
Four Whips in Telangana :అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ( MLA Adluri Laxman Kumar) ధర్మపురి నుంచి తొలిసారి నెగ్గారు. 1968 ఏప్రిల్ 1న పెద్దపల్లిలో జన్మించారు. గోదావరిఖని జూనియర్ కాలేజీలో ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా ప్రస్థానం ప్రారంభించారు. ఆ తర్వాత కరీంనగర్ జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ ప్రధాన కార్యదర్శిగా, ఎస్సీ ఆర్థిక సంస్థ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
డాక్టర్ రాంచందర్ నాయక్ (MLA Ram Chander Naik) మహబూబాబాద్ జిల్లా బొమ్మకల్‌లో 1974 జులై 6న జన్మించారు. డోర్నకల్ ఎస్టీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. జనరల్ సర్జన్‌గా ఉన్న ఆయనకు తెలుగు, లంబాడీ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో పరిజ్ఞానం ఉంది. భార్య ప్రమీల గైనకాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. ఒకరు మెడిసన్, మరొకరు ఇంజినీరింగ్ చదువుతున్నారు.