పన్నులపై జీహెచ్ఎంసీ సమావేశం
జీహెచ్ఎంసీ మున్సిపల్ సర్కిల్ కార్యాలయాల్లో ఆస్తిపన్ను సమస్యల పరిష్కార కార్యక్రమం నిర్వహించింది.
సమావేశం నిర్వహిస్తున్న అధికారులు
ఆస్తిపన్ను సమస్యల పరిష్కారానికి జీహెచ్ఎంసీ పరిధిలోని మున్సిపల్ సర్కిల్ కార్యాలయాల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. ఆస్తి పన్నుల ఫిర్యాదులు, పన్ను మదింపు, కోర్టు కేసుల వంటి సమస్యల పరిష్కారానికి సదస్సులు నిర్వహించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొనసాగిన ఈ కార్యక్రమంలో పెండింగ్ సమస్యలను పరిష్కరించుకున్నారు. జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు.