తెలంగాణ

telangana

ETV Bharat / state

AP Police Investigation in Hyderabad : హత్య కేసులో నిందితుని కోసం హైదరాబాద్​ వచ్చిన ఏపీ పోలీసులు.. కానీ ఏం జరిగిందంటే..

AP Police Investigation in Hyderabad : ఒక హత్య కేసులో భాగంగా నిందితుల ఆచూకీ కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వచ్చిన పోలీసులను చూసి భయపడ్డ ఓ యువకుడు బిల్డింగ్​పైకి దూకి తీవ్రంగా గాయపడి.. ప్రాణాలు మీదకు తెచ్చుకున్నాడు. ఈ ఘటన జరిగి మూడు రోజులు గడిచినా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Young Man injured with fearing police Investigation
AP Police Investigation in Hyderabad

By ETV Bharat Telangana Team

Published : Sep 21, 2023, 4:41 PM IST

Updated : Sep 21, 2023, 10:03 PM IST

AP Police Investigation in Hyderabad :పోలీసుల దర్యాప్తునకు భయపడి ఓ యువకుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది. ఒక హత్య కేసులో భాగంగా నిందితుని ఆచూకీ కోసం ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చిన పోలీసులను చూసి భయపడ్డ ఓ యువకుడు.. పక్క భవనం పైకి దూకి తీవ్ర గాయపడ్డాడు. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీలో సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇంతకీ ఏమి జరిగిందంటే..వసతి గృహం, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ(DR. B. R. Ambedkar Konaseema) జిల్లా కేంద్రం అమలాపురం పరిధిలోని ఈదరపల్లిలో సెప్టెంబరు 1వ తేదీన పోలిశెట్టి కిశోర్, అడపా సాయి లక్ష్మణ్‌పై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో పోలిశెట్టి కిశోర్‌ మృతిచెందాడు. ఈహత్యకు సంబంధించి నిందితుల కోసం అమలాపురం పోలీసులు ఈ నెల 18వ తేదీ సాయంత్రం హైదరాబాద్‌లోని మాదాపూర్‌కు వచ్చారు.

కిడ్నాప్ కేసు : నిందితుల కోసం పోలీసుల వేట

Young Man Seriously Injured With Fearing Police Investigation : ఈ హత్య కేసులో నిందితులకు ఆశ్రయం ఇచ్చారన్న సమాచారంతో అమలాపురం వాసి మాదాపూర్‌లో ఉద్యోగం చేసే పోలిశెట్టి ఫణిశంకర్‌ను తొలుత అదుపులోకి తీసుకున్నారు. ఫణిశంకర్‌ తనకేమీ తెలియదని.. కేపీహెచ్‌బీలో ఉండే ఫార్మా ఉద్యోగి(Pharma Employee) మాచిరాజు ఫణి శ్రీనివాస్​కు(25) సమాచారం ఉంటుందని చెప్పాడు. పోలీసులు ఫణి శ్రీనివాస్‌ నివాసముండే కేపీహెచ్‌బీలోని శ్రీ బాలాజీ వసతిగృహానికి రాత్రి 8.30 గంటల సమయంలో చేరుకున్నారు.

ఫణి శ్రీనివాస్‌ను తాము విచారించాలని పోలీసులు వసతిగృహంలో పనిచేసే సిబ్బంది, యజమానికి చెప్పారు. మూడో అంతస్తులో ఉంటాడని యజమాని చెప్పడంతో పోలీసులు లిఫ్ట్‌లో పై అంతస్తుకి వెళ్లగా గదికి తాళం వేసి ఉంది. అప్పటికే పోలీసులు వస్తున్నారని సమాచారంతో గదికి తాళం వేసిన ఫణి శ్రీనివాస్‌ భయంతో నాలుగో అంతస్తు నుంచి పక్కనే భవనంపైకి దూకాడు. పోలీసులకు ఫణి శ్రీనివాస్‌ గదిలో కనిపించకపోవడంతో అనుమానమొచ్చి భవనం పైబాగానికి వెళ్లి చూశారు.

అతీతశక్తులంటూ పిల్లలను దేవుళ్లుగా ప్రకటన.. పోలీసుల ఎంట్రీతో..!

ఫణి శ్రీనివాస్‌ పక్కనే ఉన్న భవనం మూడో అంతస్తులోని పెంట్‌హౌస్​పై తీవ్రగాయాలతో పడి ఉన్నాడు. ముఖ భాగం, పక్కటెముకులు, కాలుకి తీవ్రగాయాలయ్యాయి. కంగారుపడ్డ పోలీసులు వసతిగృహం యజమాని, అతని సోదరుడికి విషయం చెప్పారు. అంతా కలిసి శ్రీనివాస్‌ను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం ఈఎస్‌ఐ ఆసుపత్రిలో చేర్పించారు.

AP Police Came to Hyderabad to Investigate Murder Case :ఈ వ్యవహారంపై అమలాపురం పోలీసులుకేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్​లో(KPHB Police Station) ఫిర్యాదు చేశారు. ఈదరపల్లిలో పోలిశెట్టి కిశోర్‌ హత్య కేసు నిందితులు హైదరాబాద్‌లో ఆశ్రయం పొందుతున్నారని సమాచారంతో ఇక్కడికి వచ్చామని తొలుత మాదాపూర్‌లో పోలిశెట్టి ఫణిశంకర్‌ను విచారించామని పేర్కొన్నారు. ఫణిశంకర్‌ చెప్పిన వివరాల ప్రకారం ఫణిశ్రీనివాస్‌ దగ్గర సమాచారం ఉందని చెప్పడంతో కేపీహెచ్‌బీకి వచ్చామని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు.

Police Couple Pre Wedding Shoot in Police Dress : నెట్టింట ట్రెండ్​ అవుతున్న పోలీస్​ ప్రీ వెడ్డింగ్​ షూట్​.. సీవీ ఆనంద్​ రియాక్షన్​ చూశారా!

Last Updated : Sep 21, 2023, 10:03 PM IST

ABOUT THE AUTHOR

...view details