ఏపీలో సభలు, ర్యాలీలు, రోడ్‌షోలపై ప్రభుత్వం మార్గదర్శకాలు - సభలు ర్యాలీలు రోడ్‌షోలపై ప్రభుత్వ మార్గదర్శకాలు

09:14 January 03
ఏపీలో రోడ్లపై సభలు, ర్యాలీలు, రోడ్‌షోలపై ప్రభుత్వం మార్గదర్శకాలు
AP govt guidelines on public meetings: ఆంధ్రప్రదేశ్లో రోడ్లపై సభలు, ర్యాలీలు, రోడ్‌షోలపై ఆ రాష్ట్ర సర్కార్ మార్గదర్శకాలు జారీ చేసింది. గుంటూరు, కందుకూరు తొక్కిసలాట ఘటనల దృష్ట్యా హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్, పంచాయతీ రహదారులు, రోడ్డు మార్జిన్ల వద్ద పోలీసు యాక్టు నిబంధనలు వర్తింపజేశారు. ఆ ప్రాంతాల్లో రోడ్డుషోలు నిర్వహించకుండా చూడాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.
రోడ్డుకు దూరంగా, ప్రజలకు ఇబ్బందిలేని ప్రత్యామ్నాయ ప్రదేశాలు గుర్తించాలని సూచించారు. సభలు, రోడ్డుషోలు నిర్వహించే రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయ ప్రదేశాల ఎంపికపై సూచనలు పంపారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించకుండా చూడాలని హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇబ్బంది లేని ప్రదేశాల్లో సభల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు.
ఇవీ చదవండి: