ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారంలో రమేశ్ ఆస్పత్రి ఎండీ రమేశ్, నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఎం.సీతారామ్మోహన్ రావులపై తదుపరి చర్యలు నిలిపివేయాలంటూ ఏపీ హైకోర్టు ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే.
స్వర్ణప్యాలెస్ ఘటనపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం - స్వర్ణ ప్యాలెస్ ఘటన
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ గురువారం సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.
స్వర్ణప్యాలెస్ ఘటనపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం
హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ ఆన్ రికార్డ్స్ నజ్కీ... గురువారం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు సీతారామ్మోహన్రావు ఈ అంశంపై కేవియట్ దాఖలు చేశారు.
ఇదీ చదవండి:పులుల సంచారం.. ప్రజల ఆందోళన.. అధికారుల ఆనందం