తెలంగాణ

telangana

ETV Bharat / state

రజకుల సామాజిక, ఆర్థికాభివృద్ధికి కృషి: కిషన్​రెడ్డి

బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి ఆరోపించారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు హైదరాబాద్​లో ఆంధ్ర, తెలంగాణ రజక దోభి అభివృద్ధి సంస్థను ఎస్సీలో చేర్చు పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు.

kishan reddy, p and telanagana dhobi development, hyderabad
కిషన్​ రెడ్డి, హైదరాబాద్​, ఆంధ్ర, తెలంగాణ రజక దోభి అభివృద్ధి సంస్థ

By

Published : Jan 2, 2021, 7:34 PM IST

బీసీల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా కేసీఆర్​ ప్రభుత్వం వ్యవహరిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆంధ్ర, తెలంగాణ రజక దోభి అభివృద్ధి సంస్థను ఎస్సీలో చేర్చు పోరాట సమితి సంయుక్త ఆధ్వర్యంలో ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ చిత్ర పటాన్ని పార్లమెటులో పెట్టించిన ఘనత మోదీ ప్రభుత్వానిదే అని కిషన్​రెడ్డి కొనియాడారు. బీసీ కమిషన్​కు చట్టబద్ధమైన అధికారం కల్పించింది మోదీ ప్రభుత్వమేనని తెలిపారు. ముద్ర బ్యాంక్ ద్వారా కులవృత్తులకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తోందని వెల్లడించారు.

కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం

మజ్లీస్ పార్టీ నాయకులు కనిపిస్తే వంగి వంగి సలాం కొట్టే సంప్రదాయం రాష్ట్రంలో కనిపిస్తోందని మంత్రి ఎద్దేవా చేశారు. కొవిడ్ వచ్చినప్పుడు భారత్​ పని అయిపోయిందని ప్రపంచ దేశాలు భావించాయని, మోదీ సమర్థవంతమైన నాయకత్వంలో దేశం కొవిడ్​ను ఎదుర్కొంటూ అభివృద్ధి దిశగా ముందుకు వెళుతోందని తెలిపారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే విషయాన్ని.. కేంద్ర ప్రభుత్వం, బీసీ కమిషన్, ప్రధాన మంత్రి దృష్టికి తీసుకెళ్తానని కిషన్​రెడ్డి హామీ ఇచ్చారు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా రజకుల అభివృద్ధికి భాజపా కట్టుబడి ఉంటుందని వెల్లడించారు.

ఇదీ చదవండి:దా'రుణ' యాప్‌ వేధింపులు.. యువకుడు ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details