తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ శాఖకు ఏమైంది... అయితే బర్తరఫ్​ లేకుంటే ఓటమి! - ఈటల రాజేందర్​

రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రులకు కలిసి రావడం లేదు. ఆ శాఖ బాధ్యతలు నిర్వర్తించిన రెండో మంత్రి ఉద్వాసనకు గురయ్యారు. కేసీఆర్ మొదటి ప్రభుత్వంలో డాక్టర్ రాజయ్యపై వేటు పడగా తాజాగా ఈటల రాజేందర్​ను బర్తరఫ్ చేశారు. అది కూడా వైద్య పరంగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్న సమయాల్లోనే.

health minister
eetala rajendar

By

Published : May 3, 2021, 7:26 AM IST

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో మంత్రుల శాఖలకు సంబంధించి ఓ సెంటిమెంట్ ఉండేది. దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఎవరికీ కూడా రాజకీయంగా కలిసి రాలేదు. ఆశాఖ మంత్రిగా పనిచేసిన పలువురు తదుపరి ఎన్నికల్లో ఓటమి పాలవ్వడం, పదవులు దక్కకపోవడం ఉండేది. ఆ శాఖ బాధ్యతలు తీసుకోవాలంటేనే కాస్తా వెనకా ముందూ ఆలోచించే వాళ్లు. రాష్ట్ర విభజన వరకు ఈ సెంటిమెంట్ కొనసాగింది.

అదే సెంటిమెంటా..!

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ తరహా సెంటిమెంట్ వైద్య, ఆరోగ్య శాఖకు ఉన్నట్లు కనిపిస్తోంది. ఆశాఖ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఇరువురు బర్తరఫ్ అయ్యారు. 2014లో కేసీఆర్ కేబినెట్​లో ఉన్న డాక్టర్ రాజయ్య ఉపముఖ్యమంత్రి హోదాలో వైద్య, ఆరోగ్య శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. ఆర్నెళ్ల పాటే పదవిలో ఉన్న రాజయ్యకు సీఎం కేసీఆర్​ ఉద్వాసన పలికారు. ఆయనను మంత్రివర్గం నుంచి తప్పించి కడియం శ్రీహరిని కేబినెట్​లోకి తీసుకున్నారు. తాజాగా 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చాక వైద్య, ఆరోగ్య శాఖ బాధ్యతలను సీనియర్ నేత ఈటల రాజేందర్​కు అప్పగించారు. మంత్రివర్గంలోకి తీసుకున్నప్పటి నుంచే పరిస్థితులు ఏ మాత్రం ఆశాజనకంగా లేవనే చెప్పుకోవచ్చు. అప్పటినుంచి చోటుచేసుకున్న పలు పరిణామాలు, ఉదంతాలు దినదిన గండంగానే గడుస్తూ వచ్చాయి.

రెండో మంత్రిగా...

ఈటల సైతం పలు సందర్భాల్లో మాటలు రూపంలో బాణాలు ఎక్కుపెడుతూనే వచ్చారు. తాజాగా మెదక్ జిల్లా అసైన్డ్ భూముల వ్యవహారంలో మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో బర్తరఫ్​కు గురైన రెండో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల అయ్యారు. రాజయ్య అనంతరం వైద్య, ఆరోగ్య శాఖ బాధ్యతలు నిర్వర్తించిన లక్ష్మారెడ్డి 2018 ఎన్నికల్లో గెలుపొందినా మంత్రి పదవి రాలేదు. రాష్ట్ర విభజనకు ముందు సైతం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న డీఎల్ రవీంద్రారెడ్డి కూడా కేబినెట్ నుంచి బర్తరఫ్ అయ్యారు.

ఇదీ చూడండి:ఈటల రాజేందర్ ఉద్వాసనతో ప్రభుత్వ తదుపరి కార్యాచరణపై ఉత్కంఠ

ABOUT THE AUTHOR

...view details