నిమ్స్ ఎదుట ధర్నా చేస్తున్న ప్రజాసంఘాలు హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రి ఎదుట తెలంగాణ ప్రైవేటు హాస్పిటల్స్ ప్రజాసమస్యల పరిష్కార సంఘం నేతలు ధర్నా చేపట్టారు. రోగుల పట్ల వైద్యులు నిర్లక్ష్యం వహిస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని నిరసన తెలిపారు. వైద్యులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పొట్టలో కత్తెర మరచిపోయిన ఘటనలో బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆందోళన చేస్తున్న 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు.