స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మహిళను ఎక్కడైనా చంపి ఇక్కడికి తీసుకొచ్చి తగులబెట్టారా? లేక ఇక్కడే హత్యాచారం చేసి మృతదేహాన్ని తగులబెట్టారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతదేహం కాలిపోయి గుర్తుపట్టడానికి వీల్లేకుండా ఉండటంతో కొన్ని ఆధారాలను మాత్రమే పోలీసులు సేకరించగలిగారు.
శంషాబాద్‌లో మరో దారుణం.. కాలిపోయిన మహిళ మృతదేహం లభ్యం - ANOTHER INCIDENT HAPPEN AT SHAMSHABAD TOLL PLAZA
శంషాబాద్ టోల్‌ప్లాజ్ వద్ద ఘోరం జరిగి 24 గంటలైనా గడవలేదు... పోలీసులూ తిరుగుతూనే ఉన్నారు. ప్రజలంతా ఆ దారుణం నుంచి తేరుకోనేలేదు. అంతలోనే మరో ఘటన చోటుచేసుకుంది. నిన్నటి ఘటనా ప్రాంతానికి కిలోమీటరు దూరంలోనే... ఓ దేవాలయ సమీపంలో సగం కాలిన మహిళ శవం లభ్యం కావటం కలకలం రేపుతోంది.
ANOTHER INCIDENT HAPPEN AT SHAMSHABAD TOLL PLAZA
ఆ ప్రదేశం నిర్మానుష్య ప్రాంతం కావడంతో పూర్తి సమాచారం సేకరించడం పోలీసులకు కష్టంగా మారింది. మృతదేహం దగ్ధమవుతున్న సమయంలో అటుగా వెళ్తున్న వారు చూసి సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి పోలీసులకు సమాచారమందించడంతో ఈఘటన వెలుగు చూసింది. యువతి హత్యకేసును 48 గంట్లలోపే ఛేదించామని పోలీసులు భావిస్తున్న తరుణంలో సిద్దులగుట్ట రోడ్డులో జరిగిన ఈ ఘటన మరో సవాల్‌గా మారింది.
ఇవీ చూడండి: షాద్‌నగర్ ఘటన కేసులో నలుగురి అరెస్టు, పరారీలో ఒకరు
Last Updated : Nov 30, 2019, 7:27 AM IST