తెలంగాణ

telangana

ETV Bharat / state

akhila priya: భూమా అఖిలప్రియ భర్త, సోదరుడిపై మరో కేసు

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ (AKHILA PRIYA) భర్త, సోదరుడిపై మరో కేసు నమోదు నమోదైంది. బోయిన్‌పల్లి ( boinpally kidnap case) పీఎస్‌లో భార్గవ్‌రామ్, జగత్ విఖ్యాత్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. కొవిడ్ నకిలీ సర్టిఫికెట్ సమర్పించారని వీళ్లిద్దరితో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు విచారణకు హాజరురాకుండా ఉండేందుకు నకిలీ సర్టిఫికెట్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.

bhuma husband
bhuma husband

By

Published : Jul 7, 2021, 10:59 AM IST

ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి భూమా (bhuma akhila priya) అఖిలప్రియ భర్త, సోదరుడిపై మరో కేసు నమోదైంది. నకిలీ కొవిడ్‌ సర్టిఫికెట్‌ సమర్పించారని బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో భార్గవ్‌రామ్‌, జగత్‌ విఖ్యాత్‌పై కేసు నమోదు చేశారు. బోయిన్‌పల్లిలో ప్రవీణ్‌రావు సోదరుల కిడ్నాప్‌ కేసులో వీరిద్దరూ ఈ నెల 3న కోర్టులో హాజరు కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా విచారణకు హాజరుకాలేమని ఈ నెల 1న కోర్టులో నకిలీ ధ్రువపత్రం సమర్పించినట్లు అభియోగం నమోదైంది.

వారితో పాటు వైద్య సిబ్బందిపై కేసు..

దీంతో బోయిన్‌పల్లి పోలీసులు వీరు సమర్పించిన కొవిడ్‌ సర్టిఫికెట్లను పరిశీలించారు. ధ్రువపత్రం ఇచ్చిన ఆస్పత్రికి వెళ్లి విచారించగా.. నకిలీ సర్టిఫికెట్‌ జారీ చేసినట్లు గుర్తించారు. నకిలీ ధ్రువపత్రం ఇచ్చిన ముగ్గురు ఆస్పత్రి సిబ్బంది వినయ్, రత్నాకర్‌, శ్రీదేవిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి: విచారణకు పూర్తి సహకారం అందిస్తా: అఖిలప్రియ

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియ సోదరుడు జగత్‌ విఖ్యాత్‌ రెడ్డి, భర్త భార్గవ్‌ రామ్‌ గతంలో పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయారు. కిడ్నాప్‌ ఘటన జరిగినప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న నిందితులు.... మార్చి 22న సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. కోర్టు ఆదేశాల మేరకు లొంగిపోతున్నామని.. పోలీసులకు సహకరిస్తామని అప్పుడే తెలిపారు.

ఇదీ జరిగింది..

జనవరి 5న రాత్రి సమయంలో ఆదాయపన్ను అధికారులమంటూ.... సీఎం కేసీఆర్​ సమీప బంధువు, జాతీయ బ్యాడ్మింటన్‌ మాజీ ఆటగాడైన ప్రవీణ్‌రావు ఆయన సోదరులు నవీన్‌రావు, సునీల్‌రావు సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలోని మనోవికాస్‌నగర్‌లో జనవరి 5న అపహరించారు.

ఐటీ అధికారులమంటూ ప్రవీణ్‌రావు ఇంట్లోకి ముగ్గురు వ్యక్తులు చొరబడి... ప్రవీణ్‌, ఆయన సోదరులను కిడ్నాప్​చేశారు. ఈ కేసుకు సంబంధించి ఏ1గా భూమా అఖిల ప్రియను పోలీసులు అరెస్టు చేశారు. జనవరి 22న బెయిల్​పై విడిచిపెట్టారు. కేసులో ఇతర నిందితులైన భార్గవరామ్​, జగత్ విఖ్యాత్​ రెడ్డి కొద్దిరోజులు పరారీలో ఉన్నారు. ఆ తరువాత పోలీసుల ఎదుట లొంగిపోయారు.

ఇదీ చూడండి:బోయిన్‌పల్లి పీఎస్‌లో లొంగిపోయిన అఖిలప్రియ భర్త, సోదరుడు

ABOUT THE AUTHOR

...view details