హైదరాబాద్ రవీంద్రభారతిలో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఇండియా సౌజన్యంతో, ఇందిర పరశురాం బృందం సమర్పణలో ప్రముఖ కవి, రచయిత నందిని సిధారెడ్డి రాసిన 'అన్నదాత సామాజిక నృత్యరూపకం' తొలి ప్రదర్శనను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, ప్రముఖ నృత్యకళాకారిణి పద్మజారెడ్డి పాల్గొన్నారు.
రైతు వేదన
ఈ కార్యక్రమంలో పంట వేసిన నాటి నుంచి అది ఇంటికి చేరే వరకు రైతు పడే ఆవేదన, బాధలు, కష్టాలను కన్నీటికి కట్టినట్లు చక్కటి అభినయంతో ప్రదర్శించి మెప్పించారు పలువురు కళాకారులు. భూమి అనేది పాలన, అధికారానికి కేంద్ర బిందువుగా మారిందని... ఆనాటి నుంచి నేటి తెలంగాణ ఉద్యమం వరకు అదే జరుగుతుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.