లాక్డౌన్తో పేదలు, అభాగ్యులు, ఆకలితో అలమటించే అభాగ్యులను స్వచ్ఛంద సంస్థలు ఆదుకోవాలని హైదరాబాద్లోని గాంధీనగర్ కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ అన్నారు. చిక్కడపల్లి త్యాగరాయ గానసభ వద్ద పేదలకు, జీహెచ్ఎంసీ పారిశ్యుధ్ధ్య సిబ్బందికి ఆమె అన్నదానం చేశారు.
‘సమాజంలోని అభాగ్యుల ఆకలి తీర్చడానికి అందరూ కృషి చేయాలి’ - Gandhinagar Corporator Annadana News
సమాజంలోని అభాగ్యుల ఆకలి తీర్చడానికి అందరూ కృషి చేయాలని హైదరాబాద్లోని గాంధీనగర్ కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ అన్నారు. చిక్కడపల్లిలో ఆమె అన్నదానం చేశారు.
gandhi nager corporater
ఈ కష్ట కాలంలో పేదల ఆకలి తీర్చడానికి సేవా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరారు. గాంధీనగర్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో కరోనా వైరస్ నిర్మూలన జరిగే వరకు ప్రతి రోజూ ఉచిత భోజనాన్ని పేద ప్రజలకు అందిస్తామని ఆమె తెలిపారు.
ఇదీ చూడండి: ఉరివేసుకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య