తెలంగాణ

telangana

ETV Bharat / state

కొత్త పుంతలు తొక్కుతున్న వ్యవసాయ అనుబంధ రంగాలు.. యువతకు ఉపాధి మార్గాలు

Animal Nutrition and Dairy Fisheries Conference 2023: వ్యవసాయ అనుబంధ రంగాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. పశు పోషణ, పాడి, మత్స్య, కోళ్ల పెంపకం.. కొత్త ఉపాధి మార్గాలు చూపుతోంది. యువత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు. హైదరాబాద్‌ వేదికగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరిగిన పశుసంవర్థక-పాడి సదస్సు విజయవంతంగా ముగిసింది.

Hyderabad
Hyderabad

By

Published : Mar 1, 2023, 1:37 PM IST

కొత్త పుంతలు తొక్కుతున్న వ్యవసాయ అనుబంధ రంగాలు.. యువతకు ఉపాధి మార్గాలు

Animal Nutrition and Dairy Fisheries Conference 2023: హైదరాబాద్ మ్యారియట్‌ కన్వెన్షన్ సెంటర్‌లో కేంద్ర, రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహించిన 'పశు పోషణ, పాడి, మత్స్య సదస్సు–2023' విజయవంతంగా ముగిసింది. కేంద్ర పశుసంవర్థక శాఖ మంత్రి పురోషోత్తమ్‌ రూపాలా, రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఉన్నతాధికారులు సదస్సులో పాల్గొన్నారు. పశుసంవర్థక, పాడి, మత్స్య పరిశ్రమకు చెందిన పారిశ్రామికవేత్తలు, అంకుర కేంద్రాల వ్యవస్థాపకులు, రైతులు, స్వయం సహాయ బృందాల మహిళలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు.

వ్యవసాయ అనుబంధ రంగాల్లో వస్తున్న మార్పులపై చర్చలు: దేశవ్యాప్తంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో వస్తున్న విప్లవాత్మక మార్పులపై విస్తృతంగా చర్చించారు. తెలుగు రాష్ట్రాల్లో పశు పోషణ, పాడి ఉత్పత్తిలో అత్యంత కీలకమైన పచ్చిమేతల సమస్య అధిగమించేందుకు.. కార్న్‌నెక్ట్స్‌ అగ్రి ప్రొడక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ ద్వారా ఉత్తమ పరిష్కారాలు అందిస్తున్నామని ఆ సంస్థ వెల్లడించింది. కేంద్ర, రాష్ట్రాలు తమకు రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాలని పాడి రైతులు విజ్ఞప్తి చేశారు.

పాడి, పౌల్ట్రీ, మత్స్య రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయి: తెలంగాణలో మాంసం, పాలు, కోళ్లు, గుడ్లు, చేపలు ఉత్పత్తి బాగా పెరిగిందని.. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడించారు. పశు సంపద, పాడి, పౌల్ట్రీ, మత్స్య రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయని కేంద్ర పశుసంవర్థక శాఖ మంత్రి పురుషోత్తమ్‌ రూపాలా తెలిపారు. గాడిద పాలకు అద్భుతమైన డిమాండ్ ఉందని... లీటరు ధర రూ.1300 చొప్పున పలుకుతోందన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ యువ రైతు గాడిద పాలు ఉత్పత్తి చేస్తూ.. లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారని ప్రస్తావించారు. 2014కు ముందు దేశంలో అతి తక్కువ సంఖ్యలో అంకుర సంస్థలు ఉండేవి. నేడు స్టార్టప్‌ రంగంలో భారతదేశం ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. ఆత్మనిర్భర్ భారత్‌ అభియాన్‌లో భాగంగా భవిష్యత్తులో.. మౌలిక వసతుల కల్పన, మరిన్ని స్టార్టప్‌లు పుట్టుకురానున్నాయి.

"ఉత్తరప్రదేశ్​కు చెందిన యువరైతును కలిశాను. అతను గాడిద పాలు ఉత్పత్తి చేస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు. లీటరు గాడిద పాలు రూ.1300లకు విక్రయిస్తున్నాడు." - పురుషోత్తమ్‌ రూపాలా, కేంద్ర పశుసంవర్థక శాఖ మంత్రి

"ఈరోజు మన రాష్ట్రంలోని అన్నదాతల కోసం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడుతాం. మీ సహకారంతో పాటు, అందుకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించాలి." - తలసాని శ్రీనివాస్ యాదవ్, పశుసంవర్థక శాఖ మంత్రి

"మనదేశంలో సుమారు 40నుంచి 50 శాతం పచ్చిగడ్డి కొరత ఉంది. అందుకోసం పచ్చిగడ్డిని నిల్వ కోసం అత్యంత చౌకైన మెషీన్​ను రూపొందించాం. ఇందులో భాగంగానే పచ్చిగడ్డిని సంవత్సరం పాటు నిల్వ ఉంచేలా మా కంపెనీ రూపొందించిన యంత్రం బేలర్. - బేలర్ కంపెనీ ప్రతినిధి

ఇవీ చదవండి:తెలంగాణ గ్రూప్- 2 పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ

భక్తులకు గుడ్​న్యూస్​.. నేటి నుంచి ఆన్‌లైన్‌లో శ్రీరామనవమి కల్యాణ టికెట్లు

జీ20 సదస్సు కోసం తెచ్చిన పూల మొక్కలు చోరీ.. లగ్జరీ కారులో వచ్చి మరీ..

ABOUT THE AUTHOR

...view details