ఏపీలో ఇప్పటివరకు 1,955 బ్లాక్ ఫంగస్(black fungus) కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ సింఘాల్ (Anil Singhal)తెలిపారు. వీరిలో ప్రస్తుతం 1,301 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని స్పష్టం చేశారు. వీరికి పొసకొనజోన్ ఇంజక్షన్లు, ట్యాబ్లెట్ల ద్వారా చికిత్స అందుతోందన్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ కారణంగా 114 మంది మృతి చెందారని తెలిపారు.
black fungus: ఏపీలో ఇప్పటివరకు 1,955 బ్లాక్ ఫంగస్ కేసులు: సింఘాల్ - AP NEWS
ఏపీలో ఇప్పటివరకు 1,955 బ్లాక్ ఫంగస్(black fungus) కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ సింఘాల్(Anil Singhal) స్పష్టం చేశారు. ప్రస్తుతం 1,301 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా... 114 మంది మృతి చెందారని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,09,69,000 వేల మందికి వ్యాక్సిన్ వేశామన్నారు.
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నేడు 12 విడత ఫీవర్ సర్వేను ప్రారంభించామని అనిల్ సింఘాల్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4.80 లక్షల వ్యాక్సిన్ డోసులు నిల్వ ఉన్నాయన్నారు. జూన్ నాటికి మరో 51 లక్షల డోసులు కేంద్రం సరఫరా చేయాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు 1,09,69,000 వేల మందికి వ్యాక్సిన్ వేశామన్నారు. ప్రస్తుతం వ్యాక్సినేషన్ జరుగుతున్న చోటే ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు కూడా వ్యాక్సిన్ వేయాలని ఆదేశించారు. ప్రస్తుతం 15 లక్షల మంది అంగన్వాడీల్లో రిజిస్టర్ అయి ఉన్నారని స్పష్టం చేశారు. రికార్డుల్లో లేని వారు మరో రెండు లక్షల మంది ఉండొచ్చన్నారు. అందుబాటులో ఉన్న డోసులు ఆధారంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తామన్నారు.
ఇదీ చదవండి:corona cases: రాష్ట్రంలో కొత్తగా 1,813 కరోనా కేసులు నమోదు