హైదరాబాద్ దిల్సుఖ్నగర్లోని అనిబిసెంట్ మహిళా కళాశాలలో లఘు చిత్రాల పోటీలు జరగనున్నట్లు ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యుడు నటరాజ్ భట్ తెలిపారు. 'భద్రతలో మరో ముందడుగు' అనే అంశంపై పోటీలు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించిన గోడ పత్రికను బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావుతో కలిసి ఆవిష్కరించారు.
శనివారం లఘు చిత్రాల పోటీల నిర్వహణ - లఘు చిత్రాల పోటీల నిర్వహణ
హైదరాబాద్ దిల్సుఖ్నగర్లోని అనిబిసెంట్ మహిళా కళాశాలలో 'భద్రతలో మరో ముందడుగు' అనే అంశంపై లఘు చిత్రాల పోటీలు జరగనున్నట్లు బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు తెలిపారు.
శనివారం లఘు చిత్రాల పోటీల నిర్వహణ
శనివారం ఉదయం లఘుచిత్రాలను పరిశీలించి మధ్యాహ్నం రెండు గంటలకు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ చేతుల మీదుగా అవార్డును అందించనున్నట్లు వెల్లడించారు. మొత్తం 9 అవార్డులను ఇస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్లు ఇస్తామని బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు అన్నారు.