సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు మరోసారి సృజనాత్మక ప్రతిభను ప్రదర్శించారు. స్ట్రాటో ఆవరణంలో వాతావరణాన్ని అధ్యయనం చేసే నమూనా శాటిలైట్, స్వేరోశాట్-1 ను భూమి ఉపరితలంలోకి పంపించారు. ఓజోన్ సాంద్రత, రేడియేషన్ దుష్ప్రభావాలను అధ్యయనం చేసే లక్ష్యంతో... టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సహకారంతో దీన్ని రూపొందించారు. రాష్ట్రంలోని వివిధ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు చెందిన 15 మంది విద్యార్థుల బృందం... రాత్రి 2 గంటల 45 నిమిషాల సమయంలో టీఐఎఫ్ఆర్ ఆవరణలో గాల్లోకి పంపించారు. భూమి నుంచి స్ట్రాటో ఆవరణం వరకు సుమారు నాలుగు గంటల పాటు ప్రయాణించి.. రేడియేషన్ ప్రభావం, ఓజోన్ సాంద్రతకు సంబంధించిన వివరాలను సేకరించింది. సుమారు 26 కిలోమీటర్ల అక్షాంశాలకు బెలూన్ చేరుకుని అధ్యయనం వివరాలను గుల్బర్గాలోని టీఐఎఫ్ఆర్ కేంద్రానికి చేరవేసింది. విద్యార్థులను సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, గురుకుల సంక్షేమ సొసైటీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభినందించారు.
సాంఘిక సంక్షేమ విద్యార్థుల అద్భుత ప్రతిభ - koppula
రాష్ట్రంలోని వివిధ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు చెందిన 15 మంది విద్యార్థుల బృందం... మరోసారి సృజనాత్మక ప్రతిభను ప్రదర్శించారు.
అధ్బుత ప్రతిభ