Interesting Scene between KTR and Etela: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి ముందు శాసనసభలో ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల, రఘునందన్‌రావు, రాజాసింగ్ వద్దకు మంత్రి కేటీఆర్ వచ్చి ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారి మధ్య సంభాషణ జరిగింది. హుజురాబాద్‌లో జరిగిన అధికారిక కార్యక్రమంలో ఎందుకు పాల్గొనలేదని ఈటలను కేటీఆర్ ప్రశ్నించినట్లు సమాచారం. పిలిస్తే కదా హాజరయ్యేదంటూ ఈటల సమాధానం ఇచ్చారు. ప్రభుత్వ విధానాలు ప్రజల్లోకి వెళ్లే ప్రాక్టీస్ సరిగాలేదని కేటీఆర్‌కు హితవు పలికారు.
కేటీఆర్‌కి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన రాజాసింగ్ : ఈటల, కేటీఆర్ సంభాషణ మధ్యలో సీఎల్పీ నేత భట్టీ ఎంట్రీ ఇచ్చారు. తనను సైతం అధికారిక కార్యక్రమాలకు పిలువటం లేదంటూ భట్టి ప్రస్తావించారు. కనీసం కలెక్టరేట్ అయినా ఆహ్వానించాలని ఈటల అన్నారు. ఈటల వ్యాఖ్యలకు కేటీఆర్ నవ్వి ఊరుకున్నారు. దీంతో గవర్నర్ సభలోకి వస్తున్నారంటూ కేటీఆర్‌ను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అప్రమత్తం చేశారు. దీంతో తన ట్రెజరీ బెంచీల వైపు కేటీఆర్ వెళ్లిపోయారు. కేటీఆర్ కంటే ముందు ఈటల వద్దకొచ్చి డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ప్రత్యేకంగా మాట్లాడారు. అసెంబ్లీలో కేటీఆర్ -రాజాసింగ్ మధ్య సైతం సంభాషణ చోటు చేసుకుంది. రాజాసింగ్ కాషాయ చొక్కా వేసుకు రావడంతో.. ఆ చొక్కారంగు కళ్ళకు గుచ్చుకుంటుంది. ఆ రంగు నాకు ఇష్టం ఉండదని కేటీఆర్ అన్నారు. కాషాయ రంగు చొక్కా భవిష్యత్‌లో మీరు వేసుకోవచ్చేమో అని రాజాసింగ్ మంత్రి కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు.