తెలంగాణ

telangana

ETV Bharat / state

హుటాహుటిన దిల్లీ బయలుదేరిన అమిత్​ షా

కేంద్ర హోం మంత్రి అమిత్ షా హుటాహుటిన దిల్లీ బయలుదేరి వెళ్లారు. జైట్లీ కన్నుమూత వార్త తెలియగానే హైదరాబాద్‌ పర్యటనను అర్ధంతరంగా ముగించుకున్నారు.

అమిత్​ షా

By

Published : Aug 24, 2019, 1:09 PM IST

ఐపీఎస్​ల పాసింగ్​ పరేడుకు హైదరాబాద్​ వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా హుటాహుటిన దిల్లీ బయలుదేరి వెళ్లారు. కేంద్ర మాజీ మంత్రి, భాజపా సీనియర్​ నేత జైట్లీ కన్నుమూత వార్త తెలియగానే హైదరాబాద్‌ పర్యటనను అర్ధంతరంగా ముగించుకున్నారు. జైట్లీ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

"అరుణ్‌జైట్లీ మరణం చాలా బాధాకరం, జైట్లీ భాజపా సీనియర్‌ నేత మాత్రమే కాదు, మా కుటుంబ సభ్యుడిలాంటి వారు. ఎప్పుడూ నాతో ఉంటూ మార్గనిర్దేశం చేసి, నా ఎదుగుదలకు దోహదం చేశారు." - కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా

ఇదీ చూడండి: రైలెక్కేసెయ్​.. శ్రీరామ జాడలపై ఓ లుక్కేసేయ్​!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details