అమరావతిలోని కార్యనిర్వహణ రాజధానిని విశాఖకు తరలిస్తున్నారని.. ఏపీ హైకోర్టులో అత్యవసర విచారణ జరపాలని అమరావతి పరిరక్షణ సమితి అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. సచివాలయాన్ని ఏపీ ప్రభుత్వం విశాఖకు తరలించేందుకు ప్రయత్నం చేస్తోందని వ్యాజ్యంలో పేర్కొంది. ఇందులో భాగంగానే విశాఖలోని గ్రేహౌండ్ కాంపౌండ్‌కు ఫర్నీచర్‌ను తరలించారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఏపీ రాజధాని తరలింపుపై అత్యవసర విచారణ జరపాలని వ్యాజ్యం
ఈ నెల 28న ఏపీ సచివాలయాన్ని విశాఖకు తరలించే ప్రయత్నం చేస్తున్నారని హైకోర్టులో అమరావతి పరిరక్షణ సమితి తెలిపింది. ఈ క్రమంలో విచారణ జరపాలని ఆ రాష్ట్ర హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. రాజధాని తరలింపు అంశంపై ఇప్పటికే పెండింగ్ లో ఉన్న పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని కోరింది.
court
ఈనెల 28న సెక్రటేరియట్‌ను విశాఖకు మార్చేందుకు ముహూర్తం నిర్ణయించారని తెలిపారు. రాజధాని తరలింపు అంశంపై ఇప్పటికే హైకోర్టులో వ్యాజ్యం పెండింగ్‌లో ఉందని... ప్రస్తుతం ప్రభుత్వం రాజధాని తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నందున.. అనుబంధ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని వ్యాజ్యంలో కోరారు.
ఇదీ చదవండి:మూడు రోజుల్లో మిగతావారికీ ఆర్థిక సాయం అందాలి: సీఎం