తెలంగాణ

telangana

By

Published : Aug 1, 2019, 6:08 PM IST

Updated : Aug 1, 2019, 6:48 PM IST

ETV Bharat / state

'టెక్స్​టైల్ పార్క్ విషయంలో ఎవరిని బెదిరించలేదు'

రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం విశేషంగా కృషిచేస్తోందని పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి అన్నారు. స్త్రీనిధి ద్వారా మహిళలకు లభిస్తోన్న సేవలపై మహిళలకు అవగాహన కల్పించేందుకు స్త్రీనిధి కరదీపిక, స్నేహ అవగాహన బ్రోచర్లను ఆవిష్కరించారు.

మహిళలందరికీ స్త్రీనిధి ఫలాలు అందాలి: మంత్రి ఎర్రబెల్లి

స్త్రీనిధి పథకం ద్వారా లభించే అన్ని సౌకర్యాలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని పంచాయతీ రాజ్​శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మహిళలకు సూచించారు. సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో సురక్ష విస్తరణ సేవలను ప్రారంభించారు. స్త్రీ నిధి కరదీపిక, స్నేహ అవగాహన బ్రోచర్లను ఆవిష్కరించారు. ఉపాధి హామీ వార్షిక నివేదికను విడుదల చేశారు. రుణాలు పొందిన మహిళలు దురదృష్టవశాత్తూ మరణిస్తే బకాయి మొత్తాన్ని బీమా సొమ్ము నుంచే చెల్లించేలా లోన్ సురక్ష కార్యక్రమం రూపొందినట్లు మంత్రి తెలిపారు. దహన సంస్కరాల కోసం లబ్థిదారు కుటుంబానికి ఐదు వేల రూపాయల సాయం అందించనున్నారు.

కాకతీయ మెగా టెక్స్​టైల్​ పార్క్​ విషయంలో వివరణ

కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ భూసేకరణ విషయంలో తాను ఎవరినీ బెదిరించలేదని మంత్రి వివరణ ఇచ్చారు. కేవలం ఒక్కరి వల్లే మొత్తం ఆగిపోతోందని తన శిష్యుడు యాకస్వామిని మందలించానని చెప్పుకొచ్చారు.

'టెక్స్​టైల్ పార్క్ విషయంలో ఎవరిని బెదిరించలేదు'

ఇదీ చూండండి: పాఠశాలల్లో హాజరు శాతం పెరిగేలా విద్యాశాఖ చర్యలు

Last Updated : Aug 1, 2019, 6:48 PM IST

ABOUT THE AUTHOR

...view details