తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో వేరుశనగ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలి

దిల్లీలో అన్ని రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రుల సదస్సు జులై 8న జరిగింది. ఈ సదస్సులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు.

రాష్ట్రంలో వేరుశెనగ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలి

By

Published : Jul 9, 2019, 5:07 AM IST

Updated : Jul 9, 2019, 7:09 AM IST

వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రానికి చేయూతనివ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు. దిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అధ్యక్షతన జులై 8న జరిగిన అన్ని రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో వేరుశనగ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని, అన్ని పంటలకు మద్దతు ధర ఇవ్వాలని మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు.

రాష్ట్రంలో వేరుశెనగ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలి

తెలంగాణలో మిషన్ కాకతీయ కింద 46 వేల చెరువులు పునరుద్ధరించామని, దానికి నీతి అయోగ్ 24 వేల కోట్లు ఇవ్వాలని సూచించినా కేంద్రం నిధులివ్వలేదని గుర్తు చేశారు. కేంద్రం అమలు చేస్తున్న ప్రధాని కిసాన్ సమ్మాన్ యోజనకు తెలంగాణ రైతుబంధు అమలు విధానాలు మార్గదర్శకం కావడం సంతోషకరమని ఆయన అన్నారు.

ఇదీ చూడండి : 'బడ్జెట్ ప్రతిపాదనలతో స్థిరాస్తి రంగానికి ఊతం'

Last Updated : Jul 9, 2019, 7:09 AM IST

ABOUT THE AUTHOR

...view details