ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభంలోనే చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో అలుగులు పారుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల పరిధిలోని చెరువులు ఎక్కువ శాతం జలకళను సంతరించుకున్నాయి. పలు జిల్లాల్లో చెరువులు నిండి.. నీరు బయటకు పొంగి ప్రవహిస్తున్నాయి. అలుగులు పోస్తూ పొలాల వెంట పరుగులు తీస్తున్నాయి.
Ponds with water: భారీ వర్షాలతో జలకళ.. నిండుకుండల్లా చెరువులు
మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో చెరువులు జలకళను సంతరించుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న జోరు వానలతో అలుగులు పొంగిపొర్లాయి. కొన్ని చెరువులు పూర్తిగా నిండగా.. మరికొన్నింటిలో దాదాపు 75 శాతం వరకు నీరు వచ్చి చేరాయి.
రాష్ట్రంలో నిండిన చెరువులు
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 43 వేల 863 చెరువులు ఉండగా.. అందులో 4,689 పూర్తిగా నిండి అలుగు పోస్తున్నాయి. మరో 7,574 చెరువులు 75 శాతం నుంచి వందశాతం వరకు జలాలతో కళకళలాడుతున్నాయి. మరో 8,469 చెరువుల్లో 50 శాతం నుంచి 75 శాతం వరకు నీరు వచ్చి చేరింది. రాష్ట్రంలోని 10,132 చెరువుల్లో 25 నుంచి 50 శాతం వరకు నిండుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే 12,990 చెరువుల్లో మాత్రం 25 శాతం వరకే జలమట్టం ఉందని అంచనా వేశారు.
ఇవీ చూడండి: