తెలంగాణ

telangana

ETV Bharat / state

'విశాఖ ఉక్కు' ప్రైవేటీకరణ.. ఒడిశా నేతల కుట్ర: అవంతి - latest news in visakha steelplant

విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేయొద్దని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. ప్రైవేటీకరణపై అన్ని పార్టీలతో కలిసి పోరాడతామని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.

'విశాఖ ఉక్కు' ప్రైవేటీకరణ.. ఒడిశా నేతల కుట్ర: అవంతి
'విశాఖ ఉక్కు' ప్రైవేటీకరణ.. ఒడిశా నేతల కుట్ర: అవంతి

By

Published : Feb 11, 2021, 10:58 PM IST

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయం ఒడిశా నేతల కుట్రేనని వైకాపా నేతలు ఆరోపించారు. ప్రైవేటీకరణపై వివిధ పార్టీలు, ఉద్యోగ సంఘాలతో మంత్రి అవంతి శ్రీనివాస్‌, ఎంపీ విజయసాయిరెడ్డి చర్చించారు.

రాజకీయం చేయెుద్దు: అవంతి

స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేయొద్దని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. కేంద్ర ఉక్కుశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్‌.. ఒడిశాకు చెందినవారు కావడం దురదృష్టకరమని మంత్రి అన్నారు. ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించలేదని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే ఇదంతా జరుగుతుందనే ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. ఈ విషయంలో లాలూచీ పడ్డారనే ఆరోపణలను నూటికి నూరుపాళ్లు అవాస్తవమన్నారు.

ప్రధానిని కలుస్తాం: విజయసాయి

స్టీల్‌ ప్లాంట్‌పై అన్ని పార్టీల ఎంపీలతో కలిసి ప్రధానిని కలుస్తామన్న ఎంపీ విజయసాయి... శుక్రవారం తమ ఎంపీలు అమిత్‌షాకు మెమెరాండం అందజేస్తారని తెలిపారు. ప్రధాని మోదీ సమయమిస్తే కార్మిక సంఘం నేతలను దిల్లీ తీసుకెళ్తామన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పోస్కో సంస్థకు కేంద్ర ప్రభుత్వం అమ్మే పరిస్థితి ఉంటే.. విశాఖ ప్రజలే ముందుకొచ్చి కొనుక్కొంటారని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణకు అంగీకరించబోమని ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:రాజన్న రాజ్యం కోసం ఖమ్మం జిల్లాలో షర్మిల పర్యటన

ABOUT THE AUTHOR

...view details