Akshaya Patra Foundation Team Meet CM Revanth Reddy : హైదరాాబాద్‌లోని సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని అక్షయ పాత్ర ఫౌండేషన్ బృందం మర్యాద పూర్వకంగా కలిసింది. అక్షయ పాత్ర ఫౌండేషన్(Akshaya Patra Foundation) రీజినల్ ప్రెసిడెంట్ సత్య గౌర చంద్ర దాస ప్రభు జీ ముఖ్యమంత్రికి శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి వారి చిత్ర పటాన్ని, భగవద్గీతను అందజేశారు. దేశంలో ఎలాంటి లాభాన్ని ఆశించకుండా పని చేస్తున్న సంస్థల్లో అక్షయ పాత్ర ఫౌండేషన్ ఒకటి. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో వారు చేస్తున్న కార్యక్రమాలను సీఎంకు వివరించారు.
కొవిడ్‌పై పోరులో 'అక్షయ పాత్ర ఫౌండేషన్'.. వ్యాక్సిన్ వేయించుకుంటే ఉచిత రేషన్
Akshaya Patra Foundation Programmes in INDIA: భారతదేశంలోని ఆకలి, పోషకాహార లోపం తదితర సమస్యలను పరిష్కరించడానికి అక్షయ పాత్ర ఫౌండేషన్ కృషి చేస్తోంది. ఓ చిన్నారి చదువుకు దూరం కాకుడదనే దృక్పథంతో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఎయిడెడ్ పాఠశాలలోని విద్యార్థులు ఆకలితో లేకుండా ఉండేలా, అదే సమయంలో పిల్లలను తిరిగి పాఠశాలకు తీసుకురావడానికి కృషి చేస్తోంది. దేశంలో 15 రాష్ట్రాలు,2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 20 లక్షల మంది పిల్లలకు ఆహారాన్ని అందిస్తూ ప్రపంచంలోనే అతి పెద్ద మధ్యాహ్నా భోజన కార్యక్రమంగా ఎదిగింది.