మల్లారెడ్డిని మంత్రి మండలి నుంచి బర్తరఫ్ చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కమిటీ(ఏఐఎస్ఎఫ్)డిమాండ్ చేసింది. న్యాక్ గ్రేడ్ కోసం మంత్రి నకిలీ ధ్రువపత్రాలు సృష్టించారని ఆరోపించింది. ఈ మేరకు ఏఐఎస్ఎఫ్ నాయకులు హైదరాబాద్లోని నారాయణగూడలో ఆందోళన నిర్వహించారు.
ఇదొక్కటే కాదు
విద్యను వ్యాపారం చేస్తూ అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్న మల్లారెడ్డి.. న్యాక్ గ్రేడింగ్ కోసం అక్రమ మార్గాలను ఎంచుకుని దొరికిపోయారని నాయకులు విమర్శించారు. ఒక్క మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల మాత్రమే కాదని.. రాష్ట్రంలో వందల సంఖ్యలో ఉన్న ప్రముఖ కళాశాలల్లో అక్రమ మార్గాన న్యాక్ గ్రేడ్, యూజీసీ స్వయంప్రతిపత్తి పొందుతున్నారని దుయ్యబట్టారు.